

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ముస్లిం సోదరులు ఈ రోజు జుమ్మా నమాజ్ అనంతరం ప్రార్థనలో ముస్లిం సోదరులు నల్ల రిబ్బన్లు ధరించి కాశ్మీర్ పెహర్గాన్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది అసువులు బాసిన వారిని తలుచుకుంటూ మానవహారం నిర్వహించారు.వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని అల్లా కు దువా చేయడం జరిగింది.
ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ ఉగ్రవాదులను పూర్తిగా అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ,జోహార్ అమరవీరులారా, ఉగ్రవాదాన్ని అరికడదాం అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పటాన్ రియాజ్ ఖాన్, షేక్ ఇజాజ్ అహ్మద్,ఆఫ్రిది,రియాజ్, రహీమ్ మరియు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.