

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ పట్టణంలోని CSI చర్చి పక్కన లాస్విత చిల్డ్రన్స్ హాస్పిటల్ మిద్దె పైన జె.వి.ఎస్. స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ కోచింగ్ సెంటర్ ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా లాస్విత చిల్డ్రన్స్ హాస్పిటల్ డా.ఎం పెంచలయ్య,ఎం.లక్ష్మి దేవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోచ్ జె వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ టైక్వాండో అనేది ఒక యుద్ధ కళ, ఇది వివిధ రకాల ఉపయోగాలు కలిగి ఉంది. ఇది శారీరక, మానసిక మరియు సామాజిక ప్రయోజనాలను అందిస్తుంది. టైక్వాండో సాధన ద్వారా ఆత్మరక్షణ, శరీర బలం, సమతుల్యత, దృష్టి, ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణను పెంచుకోవచ్చు, డా. పెంచలయ్య మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్న అఘాట్రాల నుండి మనకు మనమే రక్షించుకోవడానికి చిన్నపిల్లలకి,మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే దాని బదులు మన ఆత్మ రక్షణ కోసం అన్ని రంగాలలోనూ ముందుండాలని అన్నారు. బాక్సింగ్” అనేది సాధారణంగా క్రీడనే సూచిస్తుంది, ఇది రింగ్‌లో పిడికిలితో పోరాడే చర్యను , అలాగే బాక్సింగ్ సమాజంలో రక్షణగా ఉపయోగపడుతుంది. “బాక్సర్” అనేది క్రీడలో పాల్గొనే వ్యక్తిని, ఈ రకమైన పోరాటంలో పాల్గొనే వ్యక్తిని సూచిస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా బాక్సింగ్,టైక్వాండో వంటి నేర్చుకుని ఉండాలని సూచించారు. ఈరోజు నుండి సమ్మర్ క్లాస్ లో ప్రారంభమవుతాయని తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7:30 వరకు బద్వేల్ బాలుర ఉన్నత పాఠశాల నందు, సాయంకాలం లాస్విత హాస్పిటల్ నందు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోసీనియర్ ప్లేయర్స్
టి. సురేష్,బి రాజు, సి సుభద్ర సి మనోహర్ తదుపరులు పాల్గొన్నారు.