• ​అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో అర్జీల స్వీకరణ
  • ​అర్జీల సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100
  • ​ఆన్‌లైన్ ఫీడ్‌బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్ సౌకర్యం
  • ​జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

​తిరుపతి (అక్టోబర్ 11):

ఈ నెల 12వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుపతి జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల రెవెన్యూ, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

​అర్జీదారులు తమ అర్జీల పురోగతిని తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ సేవల నాణ్యతను పెంచేందుకు కొత్తగా క్యూఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, దాని ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చని పేర్కొన్నారు.

​కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని, గతంలో దరఖాస్తు చేసిన వారు పాత రసీదు (స్లిప్పు)ను తప్పనిసరిగా తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సమస్య పరిష్కార సమాచారాన్ని ఎస్‌ఎంఎస్, వాట్సాప్ మరియు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అర్జీదారులకు పంపుతామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *