న్యూ బాలాజీ నగర్ పరిధిలోని తూర్పు వీధి, ఆర్ టి సీ అంగన్వాడీ కేంద్రం లలోని మహిళలకు గుడ్డ సంచులు పంపిణీ.

అంగన్వాడీ కేంద్రంలోని 25 మంది చిన్నారులకు పాదాలకు రక్షణ నిచ్చే సాక్స్ పంపిణీ.

గూడూరు పట్టణ పరిధిలోని న్యూ బాలాజీ నగర్
తూర్పు అంగన్వాడీ కేంద్రం ఆవరణలో శుక్రవారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి పేరిట ఏర్పాటైన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, కోరుతూ తూర్పు వీధి, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న మహిళలకు అవగాహన కల్పించారు.
ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ద్వితీయ కుమారుడు ముప్పవరపు సాయి సుమంత్ లహరిల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు
ప్లాస్టిక్ వినియోగం వల్ల రానున్న రోజుల్లో భూమి మొత్తం సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉందని కావున ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి దాని పట్ల వచ్చే వినాశాన్ని తగ్గించాలని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కోరారు.
ముప్పవరపు లీలామోహన్ కృష్ణ ద్వితీయ కుమారుడు ముప్పవరపు సాయి సుమంత్ వారి శ్రీమతి లహరిల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని
రెండు అంగన్వాడీ కేంద్రంలోని మహిళలకు, అంగనవాడి కేంద్రం చిన్నారులకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా ఆపివేయాలని తద్వారా భూమిపై ఉష్ణోగ్రతలు సమతుల్యం తగ్గుతాయని, కావున ప్రతి ఒక్కరూ వారి కుటుంబ అవసరాల నిమిత్తం బజారుకు వెళ్లే ప్రతి ఒక్కరు మేము అందించే గుడ్డ సంచులను వాడాలని అలా వాడికే పర్యావరణం పై ముప్పు కొంతమేర అరికట్టవచ్చు అని లీలా మోహన్ కృష్ణ కోరారు.
అనంతరం బాలాజీ నగర్ పరిధిలో ఉన్న తూర్పు వీధి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ మహిళలందరికీ గుడ్డ సంచులు పంపిణీ చేశారు.
అదేవిధంగా రెండు అంగనవాడి కేంద్రాల్లో నివసిస్తున్న 25 మంది అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు ప్రస్తుత వేసవి సీజన్ లో మరియు వచ్చే చలికాలంలోనూ వాడుకునే నిమిత్తం చిన్నారుల పాదాలకు అవసరమైన మరియు సురక్షితమైన సాక్షులను ప్రతి ఒక్క విద్యార్థికి జత చొప్పున పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి న్యూ బాలాజీ నగర్ లో ఉన్న అంగనవాడి కేంద్రం నిర్వాహకులు సాజిదా, లక్ష్మి పట్టణ మహిళలు, అంగనవాడి చిన్నారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *