• ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహణ
  • మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీనివాసులు

కరకంబాడి (రేణిగుంట):
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ‘సేవా సంకల్ప్ అభియాన్’ స్ఫూర్తితో, రేణిగుంట మండలంలోని కరకంబాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల కమిటీ చైర్మన్ భాస్కర్ ఆధ్వర్యంలోగురువారం రెండు విశిష్ట సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన సదస్సు (నషా ముక్త్ భారత్ అభియాన్) మరియు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పాఠశాల ఆవరణలో బృహత్ వృక్షారోపణ (మొక్కలు నాటే) కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తు అని పేర్కొన్నారు. “మాదకద్రవ్యాలు లేని నవసమాజం – పచ్చదనంతో కూడిన ఆరోగ్యకర భవిత” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సామాజిక బాధ్యత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.ఐ. శ్రీనివాసులు విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలు, చట్టపరమైన చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని సూచించారు. అనంతరం అతిథులందరూ కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పాఠశాల కమిటీ ఛైర్మన్ భాస్కర్ ని, పాఠశాల ప్రధానోపాధ్యాయులను (హెచ్.ఎం) నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ & జిల్లా ప్రధాన కార్యదర్శి బి.డి. బాలాజీ, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి తేజోవతి, మండల అధ్యక్షులు ప్రేమ్ రెడ్దీ,దీపక్,జిల్లా నాయకులు యతీంద్ర రెడ్డి, మార్కెట్ కమిటీ మెంబర్ జయకుమారి, మండల ఉపాధ్యక్షులు హరీష్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్, శ్రావణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed