కలిగిరి ఏప్రిల్ 06, మన న్యూస్ ప్రతినిధి కే నాగరాజు

వందరోజుల ప్రణాళికలో పూర్తిస్థాయిలో చెరువుల అభివృద్ధి చేస్తామని ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండలంలోని గుడ్లధన చెరువు ప్రాంతంలో సోమవారం జల ఆధార సాగునీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు పరిశ్రమలతో పాటు వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యతని ఇవ్వాలన్నది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షాన్ని అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నారన్నారు. సోమశిల ఉత్తర కాలువ కలిగిరి మండలంలో 22 కి,మీ  పోతున్న కేవలం 900 ఎకరాలకు మాత్రమే సాగును రంధించడం సరికాదన్నారు.నియోజకవర్గం పాలన చేసిన ఓ కుటుంబం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క చెరువులో కూడా పూడికతీయుత పనులు కాలువ విస్తీర్ణ పనులు చేసిన దకాలు లేవన్నారు. చెరువుల అభివృద్ధికి సంబంధించి ఎక్కువ పనులు గుర్తిస్తే వాటి నిధులు మంజూరుకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎరుకులరెడ్డిపాలెం గ్రామానికి చెందిన sk కాజా మస్తాన్ వెంటనే జరుగుతున్న సభలోనే చెరువు అభివృద్ధి కొరకు 5 లక్షల రూపాయలను తన వంతు సహాయంగా ఆర్థికంగా అందజేస్తానని పేర్కొనడంతో ఎమ్మెల్యే కాకర్ల అభినందించారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పూసల వెంగప నాయుడు, టిడిపి రాష్ట్ర రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు, జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు బెజ్జం కృష్ణారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు చీమల తాతయ్య, కృష్ణ జీవీ రెడ్డి, రైతు నరేంద్ర, మునగాల దశరధరామిరెడ్డి,మండల నయకులు, స్థానిక నాయకులు రైతులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *