• 5, 6, 7 వార్డుల అభ్యర్థులు గోసాల అరుణ,పాపన మల్లెం కొండారెడ్డి, మధు మద్దులూరి లతో కలిసి ఇంటింటి ప్రచారం

• గ్రామ సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ

కలిగిరి, నవంబర్ 22 :మన ద్యాస ప్రతినిధి శ్రీకాంత్ కుట్టుబోయిన

కలిగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ మద్దతుతో కలిగిరి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దాసరి జయమ్మ, ఈరోజు కలిగిరి ఎస్టీ కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 5, 6, 7 వార్డుల అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, తన ఎన్నికల గుర్తు “మంచం”పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా దాసరి జయమ్మ మాట్లాడుతూ.. సర్పంచ్‌గా తనకు అవకాశం కల్పిస్తే గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే సర్పంచ్‌గా సేవలందిస్తానని పేర్కొన్నారు.ఐదో వార్డు అభ్యర్థి గోసాల అరుణ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తన ఎన్నికల గుర్తు ‘గౌను’పై ఓటు వేసి గెలిపించాలని వార్డు ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గోసాల అరుణ మాట్లాడుతూ.. ఐదో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, వార్డు అభివృద్ధికి బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు.ఆరో వార్డు అభ్యర్థి మల్లెం కొండారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొని, తన ఎన్నికల గుర్తు ‘ప్రెషర్ కుక్కర్’పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆరో వార్డులో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు బాధ్యత తీసుకుంటానని తెలిపారు.ఏడో వార్డు అభ్యర్థి మధు మద్దులూరి సైతం ప్రచారంలో పాల్గొన్నారు. తన ఎన్నికల గుర్తు “ప్రెషర్ కుక్కర్”పై ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు. ఏడో వార్డులో ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ, వార్డు అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో కలిగిరి బిట్-2 ఎంపీటీసీ మరియు మాజీ ఉపసర్పంచ్ పాలూరు కొండారెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి దాసరి జయమ్మతో పాటు ఐదు, ఆరు, ఏడో వార్డు అభ్యర్థులు కలిసి నిర్వహించిన ఈ ప్రచారంతో కలిగిరి ఎస్టీ కాలనీలో ఎన్నికల సందడి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *