రేణిగుంట నవంబర్ 8
​తిరుపతి:
తిరుపతి నగర పౌరులకు మేయర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జేబీ శ్రీనివాస్ (మన్నెం శ్రీనివాస ప్రసాద్) దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కాంతివంతమైన పండుగ తిరుపతి ప్రజల జీవితాల్లో నూతన కాంతులు, నిండైన సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ఈ దీపావళి పర్వదినాన ప్రతి ఇంటా వెలిగే దివ్య దీపాలు ప్రజల జీవితాల్లో చీకట్లను తొలగించి, నూతన కాంతులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి, నాకు అందించిన విజయానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాకు ఇచ్చిన ‘గెలుపు’ అనే వెలుగును తిరుపతి నగర అభివృద్ధికి వినియోగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తున్నాను” అని స్పష్టం చేశారు.
​అలాగే, ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు మేయర్ జేబీ శ్రీనివాస్ తమ సందేశంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *