రేణిగుంట నవంబర్ 8

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ‘రావిళ్ల మునిరాజా నాయుడు’ , అలాగే రేణిగుంట మండలంలో బిజేపి నాయకురాలు ‘జి. పాలెం తేజవతి’ ఘన విజయం సాధించారు.

శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దిశానిర్దేశంలో కూటమి శ్రేణులు సాధించిన ఈ విజయంపై నియోజకవర్గవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

విజయం సాధించిన అనంతరం అభ్యర్థులు రావిళ్ల మునిరాజా నాయుడు , జి. పాలెం తేజవతి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వగృహానికి చేరుకుని ఆయనను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాస ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

గెలుపొందిన అభ్యర్థులకు మరియు బొజ్జల సుధీర్ రెడ్డి కి నాయకులు, అభిమానులు పూలమాలలు, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

నాయకులు, కార్యకర్తల నినాదాలతో ఎమ్మెల్యే నివాసం మారుమోగింది.

మరోవైపు తొట్టంబేడు, రేణిగుంట మండలాల్లోని గ్రామ గ్రామాన కూటమి కార్యకర్తలు విజయోత్సవ సంబరాలను వైభవంగా నిర్వహించారు.

పటాకులు కాలుస్తూ, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విజయోత్సాహంతో మండలాల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *