సత్యవేడు మండలం జడ్పీటీసీ అభ్యర్థి బాలగురవం ఝాన్సీ గెలుపు కొరకు డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో సత్యవేడు పట్టణం నందు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగినది.
బాలగురవం బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని. పేద, బడుగు, బలహీన వర్గాల వారు అభివృధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని, ఇంతటి వర్షంలోను కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సంతోషం వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి,కేకేసి జిల్లా అధ్యక్షులు బాలగురవం చిరంజీవి, జిల్లా నాయకులు,నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


