పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మురసు
గడచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర తుపాన్
ప్రస్తుతం చెన్నైకి 260 కిమీ, నెల్లూరుకు 290 కిమీ, మచిలీపట్నానికి 320 కిమీ, కావలికు 310 కిమీ, ఒంగోలుకు 330 కిమీ , విశాఖపట్నానికి 470కిమీ దూరంలో కేంద్రీకృతం
ఇవాళ అర్థరాత్రి – తెల్లవారుజాము సమయంలో
నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిమీ వరకు గరిష్టంగా 120 కిమీ వేగంతో ఈదురు గాలులు
దీని ప్రభావంతో నేడు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇవాళ కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఒకటి,రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు
ఏలూరు, తూగో, పగో, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు
అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
సహాయక చర్యలు కోసం ముందస్తుగా 6 ఎన్ డి ఆర్ ఎఫ్ , 7 ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి :ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ.
