కలిగిరి అక్టోబర్ 31: మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్ కుట్టుబోయిన

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కలిగిరి మండలం వెలగపాడు ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్రావుల భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా కమ్మవారిపాలెం ఎస్సీ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమంలో కలిగిరి మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలూరు మాల్యాద్రి రెడ్డి పాల్గొని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్రావుల భాగ్యలక్ష్మికి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా కలిగిరి జడ్పీటీసీ అభ్యర్థి మాలేపాటి జయమ్మ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలను కలుసుకుని, పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజాప్రతినిధిగా అవకాశం లభిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి అవసరాలను గుర్తించి సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.ప్రజల విశ్వాసాన్ని పొందుతూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తన ఉద్దేశమని, వెలగపాడు ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వివరించారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను కలుసుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాల్లో ప్రచారాన్ని విస్తృతం చేయాలని పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *