మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు.

రేణిగుంట: పూడి రైల్వే స్టేషన్‌ నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం 1 గంటకు ముందు అందిన రైల్వే సమాచారం మేరకు, పూడి–రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్‌ నంబర్‌ 132/4-6 వద్ద పట్టాల కుడివైపున మృతదేహాన్ని గుర్తించారు.

మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటుందని, గుర్తుతెలియని రైలు నుంచి జారిపడటం లేదా ప్రమాదానికి గురికావడం వల్ల తీవ్ర గాయాలై మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి తల నుదుటిపై గాయం ఉండగా, కుడిచేయి తీవ్రంగా దెబ్బతింది. ఎడమ మణికట్టు, కుడి చీలమండ వద్ద కూడా తీవ్ర గాయాలు ఉన్నట్లు సమాచారం. శరీరంపై అక్కడక్కడ గోకుడు గాయాలు కనిపించాయి.

మృతుడు నీలం రంగు ఫుల్‌హ్యాండ్‌ షర్టు, నీలం రంగు లోదుస్తులు, ఆరెంజ్‌ రంగు పంచె ధరించి ఉన్నాడు. సుమారు 5.5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి, నలుపు-తెలుపు జుట్టుతో పాటు తెల్లని గడ్డం ఉన్నట్లు గుర్తించారు. వీపు మధ్యభాగంలో, ఎడమ తొడపై నల్లని పుట్టుమచ్చలు ఉన్నట్లు వివరించారు.

మృతుడి ఆచూకీ తెలిసినవారు లేదా కుటుంబ సభ్యులు గుర్తించగలిగే వారు సంబంధిత రైల్వే జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదన్‌రావుకు సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *