స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేణిగుంటలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి గురువారం పరిశీలించారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులతో, స్థానిక నాయకులతో ముచ్చటించి వారికి దిశానిర్దేశం చేశారు.
అభ్యర్థుల నామినేషన్ పత్రాల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల స్థాయి ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్నికల పరిశీలకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

