నిన్న వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

క్షేత్రస్థాయిలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్,తుడా ఛైర్మన్, వైస్ చైర్మన్, జేఈవో, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లు అధికారులు

తిరుపతి నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దామినేడు సమీపంలో నూతనంగా నిర్మించనున్న కోర్టు కాంప్లెక్స్ అనుసంధాన రహదారి పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ ప్రాజెక్టు పనులను నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో అధికారికంగా ప్రారంభించారు.

దీనికి అనుగుణంగా ఈరోజు దామినేడు వద్ద సాంప్రదాయబద్ధంగా భూమి పూజ నిర్వహించి క్షేత్రస్థాయి పనులను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ,తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని , తుడా వైస్ ఛైర్మన్ . గోవింద రావు , తితిదే జేఈఓ శరత్ , బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి , భానుప్రకాశ్ రెడ్డి , వన్నెకుల క్షత్రియ ఛైర్మన్ సి ఆర్ రాజన్ , యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

తిరుపతి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.

దామినేడు వద్ద రాబోయే నూతన కోర్టు కాంప్లెక్స్‌కు ప్రజలు, న్యాయవాదులు, అధికారులు సులభంగా చేరుకునేందుకు ఈ రోడ్డు నిర్మాణం ఎంతో కీలకమని తెలిపారు.

నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ, అభివృద్ధి ఫలాలను అందించేందుకు తుడా నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు.

ఈ భూమి పూజ కార్యక్రమంలో తుడా అధికారులు, ఇంజనీరింగ్ విభాగం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *