​అమరావతి:

రాష్ట్రవ్యాప్తంగా పౌరుల నుంచి వస్తున్న ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం మరియు పారదర్శకం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అభిప్రాయాలను (సిటిజన్ ఫీడ్‌బ్యాక్) సేకరించేందుకు ఒక ప్రత్యేక ‘సిటిజన్ ఫీడ్‌బ్యాక్ QR కోడ్’ ను రూపొందించింది.

​ఈ QR కోడ్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను మరింత పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.

​అంతేకాకుండా, రాష్ట్రంలోని కలెక్టరేట్లు, ఆర్‌డిఓ కార్యాలయాలు, మండలాఫీసులు మరియు గ్రామ/వార్డు సచివాలయాలు వంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల దృష్టికి సులభంగా వచ్చే అనువైన ప్రదేశాల్లో ఈ QR కోడ్‌ను ప్రదర్శించనున్నారు.

​ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ QR కోడ్‌ను స్కాన్ చేసి, ఫిర్యాదు పరిష్కారంపై తమ అభిప్రాయాలను నేరుగా నమోదు చేయవచ్చని ముఖ్య ఫిర్యాదుల అధికారి (CGO) తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పౌరులు, అధికారుల సహకారం ఎంతో విలువైనదని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *