​అక్టోబరు 12 నుంచి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

​2,800 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు..

​గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి..

​శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్, సబ్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..

​క్షేత్రస్థాయి పరిస్థితుల నిరంతర పర్యవేక్షణకు రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ..

​సోషల్ మీడియా ప్రచారాలపై ప్రత్యేక నిఘా, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు జాయింట్ యాక్షన్ టీమ్‌లు..

​సీసీటీవీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
​తిరుపతి నగరంలో డ్రోన్ల ద్వారా పరిస్థితుల పర్యవేక్షణ…

​టీటీడీ, ఆర్టీసీ, రవాణా శాఖ తదితర విభాగాలతో సమన్వయ చర్యలు..

​భక్తులకు మెరుగైన సేవలందించేందుకు తిరుమలవ్యాప్తంగా ‘మే ఐ హెల్ప్ యూ’ పోలీసు బృందాలు…

​తిరుమల (11.10.2026):
తిరుమలలో అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేపట్టినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ తెలిపారు. తిరుమల పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బందోబస్తు ప్రణాళిక, రద్దీ నిర్వహణపై ఆయన దిశానిర్దేశం చేస్తూ, ఉత్సవాల కోసం మొత్తం 2,800 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.
​అక్టోబరు 16న గరుడసేవ, 17న పుష్పకవిమానం, 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం సందర్భంగా నాలుగు మాడ వీధులు, ఘాట్ రోడ్లు, పార్కింగ్ స్థలాల్లో ప్రత్యేక అప్రమత్తత వహించాలని ఎస్పీ ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితుల నిరంతర పర్యవేక్షణకు ‘రియల్ టైమ్ మానిటరింగ్’ వ్యవస్థతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్, సబ్ కంట్రోల్ రూమ్‌లను అందుబాటులో ఉంచారు. అలాగే సీసీటీవీలు, బాడీ వార్న్ కెమెరాలు, తిరుపతి నగరంలో డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
​సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు ‘జాయింట్ యాక్షన్ టీమ్‌లను’ సిద్ధం చేశారు. టీటీడీ, ఆర్టీసీ, రవాణా శాఖల సమన్వయంతో రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు సందేహాల నివృత్తి, సహాయం అందించేందుకు తిరుమలవ్యాప్తంగా ‘మే ఐ హెల్ప్ యూ’ పోలీసు బృందాలను అందుబాటులో ఉంచారు. భక్తులందరికీ సురక్షితమైన, ప్రశాంతమైన దర్శన అనుభూతిని కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *