తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం రామానుజ పల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన మేళమరవత్తూరు ఆదిపరాశక్తి జిల్లా సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది,అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక సంప్రదాయాలు సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు,భక్తులకు అవసరమైన సమయంలో తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని,ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మేళమరవత్తూరు ఆదిపరాశక్తి జిల్లా సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పలువురు భక్తుల జీవనోపాధికి తోడ్పడే సహాయక సహకారాలు డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి చేతులపై అందించారు.ఆధ్యాత్మిక సేవతో పాటు అవసరమైన వారికి సహాయం అందించడం సమాజ సేవలో భాగమని తెలిపారు.మేళమరవత్తూరు ఆదిపరాశక్తి జిల్లా సాంస్కృతిక సేవా సంఘం తరపున డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి, ఆదిపరాశక్తి అమ్మవారి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *