రేణిగుంట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం.
రేణిగుంట
లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్, తిరుపతి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి చూపు సమస్య ఉన్న అనేకమంది వైద్య శిబిరానికి చేరుకొని కంటికి పరీక్షలు చేసుకున్నారు. నిపుణులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్
ప్రతినిధులు వచ్చిన వారికి మజ్జిగ, మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా
లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ అధ్యక్షుడు జూలియన్ రాజు మాట్లాడుతూ అడిగిన వెంటనే కాదనకుండా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన తిరుపతి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. వైద్య శిబిరాన్ని నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చిన ఎంపీడీవో, ఇతర అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మునుముందు కూడా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు రేణిగుంట జంక్షన్ లైన్స్ అందరూ సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర, ట్రెజరర్ కోటేశ్వరరావు, సభ్యులు గంగారి రమేష్, ప్రభాకర్, నవీన్, నరేష్,
అరుణ్ పాండ్యన్, అనిల్, ప్రభు, మురళి లోక నాథ నాయడు తదితరులు పాల్గొన్నారు.


