పెయింట్ షాప్ కుమార్ జన్మదినాన రేణిగుంట పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక.

రేణిగుంట అక్టోబర్ 09.

కాలం ఎంత మారినా చిన్ననాటి మిత్రుల అనుబంధం చెరిగిపోదని నిరూపిస్తూ, రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-1984 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సుదీర్ఘమైన 43 ఏళ్ల తర్వాత స్థానిక అప్పన్న ఫంక్షన్ హాల్‌లో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు . తమ పాఠశాల నాటి క్లాస్‌మేట్, ప్రముఖ వ్యాపారవేత్త పెయింట్ షాప్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని, నాలుగు దశాబ్దాల నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పాత స్నేహాన్ని మళ్లీ చిగురింపజేసేందుకు మిత్రులంతా ఒక్కటై ఈ వేడుకను పండగ వాతావరణంలో నిర్వహించారు.ఈ వేడుకలో బిజెపి మాజీ మండల అధ్యక్షుడు తేనెపల్లి రవి, ప్రముఖ న్యాయవాది జాకీర్ హుస్సేన్ ప్రత్యేక అతిథులుగా హాజరై విందును ఆస్వాదిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.బంధుమిత్రులు, నాటి స్నేహితుల సమక్షంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు తినిపించుకున్న అనంతరం, పూర్వ విద్యార్థులంతా కలిసి కుమార్ నీ ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో అప్పన్న చంద్ర, ట్రాన్స్కో వెంకటేష్, రేణిగుంట మాజీ ఉప సర్పంచ్ సూరిబాబుతో పాటు పలువురు పాత మిత్రులు హాజరై, వయస్సును మర్చిపోయి చిన్ననాటి ఉత్సాహంతో రోజంతా సందడి చేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఇలాంటి మధుర జ్ఞాపకాన్ని అందించిన నిర్వాహకులకు పూర్వ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *