ఏర్పేడు:
ఏర్పేడు మండలం ఇసుకతాగేలి మరియు పెనుమల్లం గ్రామాల్లో భూ రీ సర్వే ప్రాజెక్ట్ ద్వారా సిద్ధం చేసిన నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమం ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.
టీడీపీలోకి వైఎస్సార్సీపీ నాయకుల చేరిక:
ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు పి. చెంచుకృష్ణారెడ్డి, ఏ. బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఎమ్మెల్యే బొజ్జల సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడురూ—”పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేలా ముందడుగు వేయాలి” అని దిశానిర్దేశం చేశారు.
భారీగా పాల్గొన్న నాయకులు, అధికారులు:
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, శివశంకర్ రెడ్డి, నైనూరు పున్నారావు, గిరి నాయుడు, గాలి కృష్ణవేణి, బాబు నాయుడు, గుణా యాదవ్, కేశినేని సుబ్రమణ్యం, రాచేటి సుబ్రమణ్యం, కేకే రమణ, బి. మునిరాజ యాదవ్, సీతాపతి ఆచారి, సురేష్, గణేష్ నాయుడు, రామదాసు, మురుగన్, సుధాకర్ రెడ్డి, హంస, వెంకయ్య, గోపాల్ రెడ్డి, కుమారస్వామి, పద్మనాభ నాయుడు, రామ్ బత్తయ్య, మణి, నరసింహులు, కె. రవి, మునిరెడ్డి, చంద్ర, చలపతి నాయుడు, రమేష్ యాదవ్, వై. మనోహర్ నాయుడులతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


