​తుడా పరిధిలోని అభివృద్ధి పనులకు రూ. 200 కోట్లు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు.

​తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి నిధుల వినియోగం.

తిరుపతి అక్టోబర్ 09.

తితిదే అందించిన చేయూతపై హర్షం వ్యక్తం చేసిన తుడా
తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి శరత్ కుమార్ ని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , వైస్ ఛైర్మన్ ఆర్. గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా సత్కరించారు.తుడా పరిధిలోని వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన పనుల నిమిత్తం తితిదే ద్వారా తుడా కు రూ. 200 కోట్ల నిధులు విడుదల చేసినందుకు గాను వారు జేఈఓ కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులతో పాటు, స్థానిక నగర పౌరుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే తుడా ప్రధాన కర్తవ్యమన్నారు. తుడా పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణ నిమిత్తం తితిదే ద్వారా రూ. 200 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. నిధులను విడుదల చేసి తుడా కు వెన్నుదన్నుగా నిలిచిన తితిదే బోర్డుకు తుడా యంత్రాంగం తరఫున, తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపినట్టు తెలిపారు.తుడా వైస్ ఛైర్మన్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ:తితిదే, తుడా సమన్వయంతో నగరంలో మౌలిక వసతుల విస్తరణకు ఈ నిధులు ఎంతగానో దోహద పడతాయన్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే పరిసర ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాల మెరుగుదలకు తితిదే ఎల్లప్పుడూ ముందుంటోంది అని తెలిపారు.తుడాకు ఆర్థిక వెన్నుదన్నుగా రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేసి ప్రోత్సహించినందుకు తితిదే యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ ఈ రవీంద్రయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *