రేణిగుంట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 11వ తేదీ, ఆదివారం
నిర్వహించే మెగా ఉచిత కంటి వైద్య శిబిరం కు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ అధ్యక్షుడు జూలియన్ రాజు మాట్లాడుతూ.. లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్, తిరుపతి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఆదివారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇందులో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణుల బృందం పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు పంపిణీ చేస్తారని తెలిపారు.
కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సెక్రటరీ రాజేంద్ర, ట్రెజరర్ కోటేశ్వరరావు, మురళి, గురు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

