హైదరాబాద్‌లోని ప్రముఖ రవీంద్ర భారతి ఆడిటోరియంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రెండవ ఆవిర్భావ దినోత్సవ సభ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, వైభవంగా జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కమిటీ సభ్యులు, ఆర్టీఐ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
పాలనలో పారదర్శకత పెంచడానికి, అవినీతిని అరికట్టడానికి సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో ఒక ‘వజ్రాయుధం’ లాంటిదని, ఇది ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన వారధిలా పనిచేస్తుందని సభలో పలువురు వక్తలు పునరుద్ఘాటించారు.
ఐదుగురితో మొదలై.. వేలాది మందితో ఆవిర్భావ వేడుకలు:
2025లో కేవలం ఐదుగురు సభ్యులతో సమాచార హక్కు చట్టం సాధన కమిటీని ప్రారంభించినట్లు జాతీయ ఛైర్మన్ చంటి ముదిరాజు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే ఈ సంస్థ వేలాది మంది సభ్యులతో మహా వృక్షంలా విస్తరించిందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన కల్పిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ గారి ముఖ్య సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి.
ఎపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెట్టి వెంకటేష్ (అభి మారన్)కు ఘన సన్మానం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కార్యవర్గ సభ్యుడు, తిరుపతి జిల్లా కె.వి.బి. పురం మండలం పాతపాలెం గ్రామానికి చెందిన వేట్టి వెంకటేష్ (అభి మారన్) ను ఈ వేదికపై ప్రముఖులు ఘనంగా సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్, జాతీయ ఛైర్మన్ చంటి ముదిరాజు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, మల్లం వెంకటేష్ గౌడ్ తదితరులు అభి మారన్ అందించిన సేవలను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు.
‘పల్లె పల్లెకు ప్రతినిధి’ లోగో విడుదల – బడుగు బలహీన వర్గాలకూ ఆర్టీఐ అవగాహన:
ఈ సందర్భంగా అభి మారన్ మరియు ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో సమాచార హక్కు చట్టాన్ని కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువ చేస్తామని హామీ ఇచ్చారు.
దీనికోసం “పల్లె పల్లెకు ప్రతినిధి” అనే ప్రత్యేక లోగోతో ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచార హక్కు చట్ట సాధన కమిటీ ప్రతినిధులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
