శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ప్రాజెక్ట్ స్థాయి “పోషణ్ మా” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమ విశేషాలు:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు, తల్లుల ఆరోగ్యానికి పౌష్టికాహార ప్రాముఖ్యతను, ఆహారంలో వైవిధ్యతను మరియు “మన అంగన్వాడీ – మన బాధ్యత” అనే భావనను అందరూ అలవర్చుకోవాలని వివరించారు.
సరైన పోషకాహార పద్ధతులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన తిలకించారు.
ప్రభుత్వ సహకారంతో అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన వంట పాత్రలు , కార్యకర్తలకు యూనిఫారాలు, మరియు , పి పి 1 పి పి 2 పుస్తకాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు.
టాటా ట్రస్ట్ సహకారంతో బరువు తక్కువ ఉన్న పిల్లలకు “బాలామృతం ప్లస్” అందించారు.
ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వయంగా పిల్లలకు బాలామృతం తినిపించి, పోషకాహార లోపాన్ని నివారించడంలో దాని ప్రాముఖ్యతను వివరించారు.
అనంతరం లబ్ధిదారులకు తన చేతుల మీదుగా బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.
పిల్లల్లో పోషకాహార లోపాలను నివారించడం, అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని అందించడం మరియు తల్లులు, పిల్లలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి కుటుంబ సభ్యులు, కృష్ణ రెడ్డి (మునిసిపల్ కమీషనర్), శాంతి దుర్గ (శ్రీకాళహస్తి సీడీపీఓ )
, లక్ష్మి (టాటా ట్రస్ట్ ప్రోగ్రాం అసోసియేట్ ) ఐసీడ్స్సూ పర్వైజర్లు,మరియు,అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


