​తిరుపతి (అక్టోబర్ 07):

తిరుపతి సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ( ఎస్ ఎఫ్ ఎస్ )గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. శ్రీదేవి బుధవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

​బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆర్. శ్రీదేవి, కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ చర్యలు మరియు అటవీ శాఖ ద్వారా అమలు జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో క్లుప్తంగా చర్చించారు. జిల్లాలో అటవీ సంబంధిత అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *