గ్రామీణ ప్రాంతాల్లో దైవభక్తిని, సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించడంలో కొందరి వ్యక్తుల నిస్వార్థ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. సమాజంలో ఎంతోమంది తమ సొంత లాభం గురించి ఆలోచిస్తే, మరికొందరు మాత్రం గ్రామాభివృద్ధిని, తమ పూర్వీకుల ఆశయాలను నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంటారు. అలాంటి కోవకు చెందే ఓ యువకుడు నేడు తన గ్రామ ప్రజల మన్ననలను పొందడమే కాకుండా, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాళహస్తి మండలం ముచ్చిబోలు హరిజనవాడలో వెలసిన శ్రీ గంగమ్మ గుడి అభివృద్ధికి పూల శివ అంకితభావంతో చేస్తున్న సేవలు నేడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి.
​తండ్రి ఆశయ సాధనే ధ్యేయంగా…
​ముచ్చిబోలు హరిజనవాడ గ్రామానికి చెందిన పాడి రైతు “కోగీల చెంగల్ రాయలు” తన జీవిత కాలంలో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడానికి, గ్రామ దేవత గంగమ్మపై ఉన్న అనన్య భక్తితో ఈ హరిజనవాడలో గంగమ్మ గుడిని ఎంతో శ్రద్ధగా నిర్మించారు. తండ్రి మరణం తరువాత ఆ పవిత్ర స్థలాన్ని కేవలం ఒక సాధారణ ఆలయంగా కాకుండా, గ్రామ ఐక్యతకు, భక్తికి ప్రతీకగా నిలపాలని ఆయన కుమారుడు పూల శివ గట్టి సంకల్పం తొడిగాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన కలను సాకారం చేయడమే తన జీవిత పరమావధిగా కోకిల శివ ముందుకు సాగుతున్నారు.
​”మా నాన్న నిర్మించిన ఈ పవిత్ర ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దడమే నాకు దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత అని, గ్రామ పెద్దలు, మిత్రుల సహకారంతో ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తా.”నంటున్న తనయుడు పూల శివ.

స్నేహితుల సహకారంతో సిమెంటు రోడ్డు నిర్మాణం….

గంగమ్మ గుడికి నిత్యం వచ్చే భక్తుల శ్రేయర్థం, ఆలయ పరిసరాలు వర్షాకాలంలో లేదా సాధారణ రోజుల్లో కూడా బురదమయంగా మారి భక్తులు ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితిని గమనించిన శివ భక్తులు ప్రశాంతంగా గంగమ్మ తల్లిని దర్శనం చేసుకునేలా తన సొంత నిధులతో పాటు తన మిత్ర బృందం సహాయ సహకారాలతో గుడికి వెళ్లే మార్గంలో పటిష్టమైన సిమెంట్ రోడ్డును ఏర్పాటు చేయించారు.

విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం ప్రత్యేక కృషి….

ప్రస్తుతం గంగమ్మ ఆలయం ప్రాంతంలో రాత్రి వేళల్లో భక్తులకు వెలుతురు సౌకర్యం కల్పించే దిశగా శివ అడుగులు వేస్తున్నారు. ఆలయానికి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను అందించేందుకు దాదాపు 6 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయవలసి ఉంది. ఈ బృహత్తర కార్యానికి అవసరమైన అనుమతులు మరియు ఏర్పాట్లు కోసం ఆయన స్థానిక నాయకులను అధికారులను ఆశ్రయిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు.
గంగమ్మ గుడి లో జరుగుతున్న పునరుద్ధరణ మరియు అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో స్థానిక భక్తులు అమ్మవారి దర్శనార్థం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ పవిత్ర కార్యక్రమాల్లో భాగంగా మరియు గుడి అభివృద్ధిని పరిశీలించేందుకు పలువురు ప్రముఖులు గ్రామ పెద్దలు గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభివృద్ధి పనులను కొనియాడారు.
రవి రాజా హరి నాగరాజు చందు యోగానంద మనోజ్ జయరామయ్య మరియు ప్రభాకర్ తదితరులు గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొనీ తమ వంతు ఆలయ అభివృద్ధికి పూర్తి మద్దతు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *