కలిగిరి, సెప్టెంబర్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి ఏజిఎన్ నిర్మాణ సంస్థ అధినేతలు, చిన్న అన్నలూరు పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకులు గడ్డం రంజాన్ రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.కలిగిరి మండలం చిన్న అన్నలూరు గ్రామపంచాయతీకి చెందిన కోలా వైకుంఠ వాసు ఇటీవల కలిగిరి–కొండాపురం రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు నాలుగు చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఏజిఎన్ అధినేతలు, చిన్న అన్నలూరు పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకులు గడ్డం రంజాన్ స్పందించి బాధితుడిని పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గడ్డం రంజాన్ మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన వైకుంఠ వాసుకు తమ వంతు సహాయంగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందించిన గడ్డం రంజాన్‌కు, ఏజిఎన్ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *