రాజన్ ఆక్వా మినరల్ వాటర్ యాజమాన్యం ఉచితంగా సురక్షిత మినరల్ వాటర్.

రేణిగుంట:
స్థానిక ఆర్సీఎం ఉన్నత పాఠశాల ( ఆర్ సి ఎం హై స్కూల్ ) విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు రాజన్ ఆక్వా మినరల్ వాటర్ యాజమాన్యం ఉచితంగా సురక్షిత మినరల్ వాటర్ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ( హెచ్ఎం) గిరిబాబు తెలిపారు.
పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, రాజన్ ఆక్వా మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరంతరం ఉచిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎం గిరిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందించడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.సేవా దృక్పథంతో పాఠశాలకు ఉచితంగా తాగునీటిని సమకూరుస్తున్న రాజన్ ఆక్వా మినరల్ వాటర్ యాజమాన్యానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.సమాజ హితం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *