రేణిగుంట:

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, రేణిగుంట పట్టణంలోని జిఎం స్ట్రీట్‌లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వీధిలోని వినాయక మండపం వద్ద స్వామివారి ప్రతిష్టాపన గావించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

​భక్తుల సౌకర్యార్థం మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం మరియు ప్రసాద వితరణ చేపట్టారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

​సాయంకాలం వేళ వేడుకగా ప్రారంభమైన వినాయక నిమజ్జన మహోత్సవంలో స్థానిక నాయకులు, పురప్రముఖులు విశేషంగా పాల్గొన్నారు. ఈ నిమజ్జన ఊరేగింపులో రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, బూత్ ఇన్‌చార్జి మురళి, వినోద్, మురళి, (AC టెక్నీషియన్)సుందరం, మోహన్ బాబు, గజేంద్ర, లక్ష్మయ్య తదితరులు పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ వినాయక నిమజ్జనం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *