ప్రకాశం పార్క్ వాకర్స్‌కు బెస్ట్ క్లబ్ అవార్డు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లో స్థాపనలో ప్రజలందరూ భాగస్వాములై ఆనందకరమైన జీవితం గడపాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ తెలిపారు. తిరుపతి ప్రకాశం పార్క్‌వాకర్స్ అసోసియేషన్‌కు వచ్చిన బెస్ట్ క్లబ్ అవార్డును ఆదివారం కమిషనర్ ఎం.జయకృష్ణ తన చేతుల మీదుగా అందజేశారు. పార్కులో ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కమిషనర్ అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించాలని ఆకాంక్షించారు.
చిన్నచిన్న సమస్యలను సమిష్టి కృషితో పరిష్కరించుకోవాల ని సూచించారు.
వాకింగ్, యోగా వంటి కార్యక్రమాలు ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన ఆంధ్రప్రదేశ్‌కు పార్కులు, రిక్రియేషన్ ప్రదేశాలు అవసరమని తెలిపారు. పిల్లలను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తే చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని చెప్పారు. తాగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, వాకర్స్ మరిన్ని సేవలు చేసి మరిన్ని అవార్డులు సాధించాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి.ఈ.రమణ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపినాథ్, వెంకట రెడ్డి, జగన్నాదం, లక్ష్మీపతి,

