తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో పనిచేస్తున్న సిపిఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఒపీస్పె న్షనర్లతో సమానంగా ఈ హెచ్ ఎఫ్ (ఎంప్లాయీస్ హెల్త్ ఫండ్) ద్వారా క్యాష్‌లెస్ వైద్య సదుపాయం కల్పించాలని టీటీడీ యాజమాన్యం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, ఏపీ సిపిస్ఎం ప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ హర్షిస్తూ, టీటీడీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలికంగా చేస్తున్న విజ్ఞప్తికి స్పందించి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా టీటీడీలోని దాదాపు 3,000 మంది సిపిస్ఉ ద్యోగులు మరియు వారి కుటుంబాలకు రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి వైద్య భద్రత చేకూరుతుందని చీర్ల కిరణ్ పేర్కొన్నారు. శ్రీవారి పోటులో లడ్డూల తయారీ వేగవంతం చేసేందుకు 400 అదనపు అవుట్‌సోర్సింగ్ పోస్టుల ప్రతిపాదనలు, 48 మంది ఉద్యోగుల వేతనాల పెంపు, పారిశుధ్య సిబ్బంది రవాణా ఛార్జీల నిమిత్తం ₹1.60 కోట్లు మంజూరు చేయడం, ₹54.66 లక్షల వైద్య రీయింబర్స్‌మెంట్ ఆమోదం, అలాగే వందలాది మందికి టైమ్ స్కేల్ ప్రకటించడం వంటి నిర్ణయాలను అసోసియేషన్ స్వాగతించింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓలు శరత్, పి. గోపీనాథ్ తదితర అధికారులకు అసోసియేషన్ నాయకులు వంకీపురం పవన్, గుంటూరు రేఖ, గంటా భరత్, కొప్పర్తి శివ, హరి చౌదరి, మణికంఠ, రమాదేవి, ఈశ్వర్ నాయక్, సునీల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

