తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డికి గ్రామస్తులు ఆహ్వాన పత్రిక అందజేత.
తిరుపతి సెప్టెంబర్ 4.
రేణిగుంట మండలం, కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలోని దొడ్లమిట్ట గ్రామంలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ కట్ట పుట్టాలమ్మ దేవాలయ జాతర మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి ని గ్రామస్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఆహ్వానాన్ని స్వీకరించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, గ్రామస్తులందరికీ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కట్ట పుట్టాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.

