రేణిగుంట సెప్టెంబర్ 4. హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీగా మేకల ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి మేకల సురేష్ కుమారుడు మేకల ప్రశాంత్ విద్యావంతుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఈ సందర్భంగా మేకల ప్రశాంత్ మాట్లాడుతూ మానవహక్కుల కోసం నిరంతరం పోరాడుతామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మహిళలకు అండగా నిలుస్తామని అన్నారు. మానవహక్కులపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ గా ఎన్నికైన మేకల ప్రశాంత్ కు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకరరావు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *