ఇంజనీరింగ్ విద్యలో తృతీయ స్థానం.. స్పేస్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో వరుసగా రెండుసార్లు ప్రతిభా పురస్కారం*

ప్రత్యేకంగా అభినందించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి*

​తిరుపతి ఆగష్టు 22.
తిరుచానూరుకు చెందిన గోకుల్ సాయి రెడ్డి ఇంజనీరింగ్ విద్యలోనూ, స్పేస్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు యం. పుష్పరెడ్డి, టాక్ ఆఫ్ ది టౌన్ పత్రిక అధినేత మునిరామ్ రెడ్డి దంపతుల కుమారుడైన గోకుల్ సాయి రెడ్డి, ప్రభుత్వ కళాశాలలో ఈసీఈ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 1100/800 మార్కులతో కళాశాల స్థాయిలో తృతీయ స్థానం సాధించారు.
​అలాగే జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో వరుసగా రెండోసారి ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. శనివారం ఎస్.వి. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
​గోకుల్ సాయి రెడ్డి సాధించిన విజయానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తన నివాసంలో ఆత్మీయంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి అదనపు సౌకర్యాలను ఆశించకుండా రోజూ బస్సులోనే ప్రయాణిస్తూ, పట్టుదలతో చదివి విజయం సాధించడంపై తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు మరియు బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *