ఉత్సవాల్లో డీజేలు, ఆర్కెస్ట్రా రికార్డింగ్ డాన్సులు నిషేధం.

ఉత్సవ మండపం వద్ద తప్పనిసరి సీసీ కెమెరాలు.

ఉత్సవ కమిటీ సభ్యులతో సిఐ జయచంద్ర సమావేశం.

రేణిగుంట ఆగష్టు 22. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ లో శ్రీ అభయ వినాయక అసోసియేషన్ ఉత్సవ కమిటీ సభ్యులకు సీఐ జయచంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయ చంద్ర మాట్లాడుతూ రోడ్డులో మండపాలు ఏర్పాటుకు పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రోడ్డులో నిర్వహిస్తే పంచాయతీ, ఎలక్ట్రికల్ అనుమతులు తీసుకోవాలన్నారు. ఉత్సవంలో డీజే, ఆర్కెస్ట్రా, రికార్డింగ్ డాన్స్లు నిషేధమన్నారు. మూడు రోజులకు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయాలన్నారు. ఉత్సవాల నిర్వహిస్తూ ఎలాంటి సంఘటనలు చోటు
చేసుకున్న పూర్తి బాధ్యత కమిటీ సభ్యులు వహించాలన్నారు. మండపాలు ఏర్పాటు కోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పంచాయతీ అనుమతులు కచ్చితంగా తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఘర్షణలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఆర్గనైజర్స్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. అనంతరం శ్రీ అభయ వినాయక ఆర్గనైజర్స్ సభ్యులను బైండోవర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *