అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో సారె సమర్పించిన బొజ్జల రిషిత రెడ్డి.

రేణిగుంట ఆగష్టు 18
​రేణిగుంట పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవం కన్నులపండువగా సాగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి మంగళవారం అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు.
​ఆలయ ప్రాంగణానికి చేరుకున్న బొజ్జల రిషిత రెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ సోలా మల్లికార్జున్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు బ్యాండ్ మేళాలు, మంగళవాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు.
​అనంతరం ఆమె అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను బహూకరించారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *