రేణిగుంట ఆగష్టు 15.
భారతదేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందాం అని అంబేద్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ పిలుపునిచ్చారు. పాపానాయుడు పేటలోని జెడ్ పి హైస్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల లలో జరిగిన 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహా పురుషుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని, అట్టి ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత నేటి పిల్లలు, రేపటి పౌరులయిన మీమీద ఎంతో ఆధారపడి ఉందని స్టార్ కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మారయ్య, హెడ్ మిస్ట్రెస్ శిరీష, నాయకులు కిష్టప్ప, అర్జున్ బాబు,మునిరాజ , పేరెంట్స్ కమిటీ చైర్మన్ జగన్నాథం, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *