కలెక్టర్‌పై వ్యక్తిగత దూషణలా? భూమన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా..అధికారులను బెదిరిస్తే సహించేది లేదు..
భూమన కరుణాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి,

​తిరుపతి ఆగష్టు 14. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:బీసీ సామాజిక వర్గానికి చెందిన, ఎంతో కష్టపడి చదువుకుని పైకొచ్చిన ఒక ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు దిగడం, అధికారులను బెదిరించేలా మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించి ‘డాకు మంగళ్ సింగ్’, ‘చార్లెస్ శోభరాజ్’ వంటి పదజాలంతో దూషించడం వారి వయస్సుకు, గతంలో వారు అనుభవించిన ఉన్నత పదవులకు తగదన్నారు.ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు.ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ నమోదు అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందన్న ఆయన,విజిలెన్స్ నివేదికల ఆధారంగా చీఫ్ సెక్రటరీ నుండి వచ్చిన ఫైల్‌ను కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఫార్వార్డ్ చేసిన తర్వాతే విచారణ ప్రారంభమవుతుందని తెలిపారు. చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ల్యాండ్స్ లో అక్రమంగా రోడ్డు వేసిన వ్యవహారంపై విచారణ జరిగిందని,ఈ క్రమంలో తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సహజం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 260 ఎకరాల దామినేడు భూముల్లో మరియు మఠం తదితర భూముల్లో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు.వీటిపై మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , యువ నాయకుడు నారా లోకేష్ మరియు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు విచారణ జరిపి, ఆ భూములను కాపాడే దిశగా ఎన్డీయే ప్రభుత్వం అడుగులు వేస్తోంది అన్నారు.ఒకవేళ తమపై తప్పుగా కేసులు నమోదయ్యాయని భావిస్తే, పత్రికా సమావేశాలు పెట్టి అధికారులను బెదిరించడం మాని, నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ‘క్వాష్ పిటిషన్’ వేసుకోవచ్చు. తప్పు చేయనప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హితవు పలికారు.ఎండ, వాన అనకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మనోభావాలు దెబ్బతినేలా, వారి కుటుంబ సభ్యులు బాధపడేలా మాట్లాడటం మానుకోవాలని తెలిపారు.గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రౌడీయిజం, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇకముందు అధికారులు బెదిరింపులకు భయపడరని స్పష్టం చేస్తున్నామన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మా ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు.భవిష్యత్తులో అధికారులపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి,కమిటీ సభ్యులు విజయకుమార్, ముని రామయ్య,చెంగయ్య,రేవతి, సురేష్,జగదీష్, రవి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *