రేణిగుంట ఆగష్టు 14. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలోని తమ నివాసంలో జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసినట్లు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వెల్లడిస్తూ, ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వం అర్పించిన అమరవీరుల మహోన్నత త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తిని రగిలించడమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశమని, ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ‘మై నేషన్ – నేషన్ ఫస్ట్’ అనే భావన బలంగా నాటుకుపోవాలని ఆయన ఉద్ఘాటించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర’ సాధించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారని, ఈ ప్రతిష్టాత్మక లక్ష్య సాధనలో ప్రతి పౌరుడినీ భాగస్వామిని చేసేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగురవేసి, ఈ కార్యక్రమాన్ని విశేషంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మనమంతా ఐక్యంగా ముందుకు సాగి మన ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని మరియు దేశాన్ని ప్రగతి పథంలో నిలుపుదామని, జై హింద్, భారత్ మాతా కీ జై అని ఆయన పిలుపునిచ్చారు.

