ఏర్పేడు: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, నాయకులు పేరం ధనంజయులు నాయుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

​ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు మాట్లాడుతూ… ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందిస్తోందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శివశంకర్ రెడ్డి, గిరి నాయుడు, మోహన్ నాయుడు, సూరి నాయుడు, బాబు నాయుడు, కేశినేని సుబ్రమణ్యం, బాలసుబ్రహ్మణ్యం, చిన బత్తి రెడ్డి, వై. మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *