మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
50% రాయితీపై ప్రభుత్వం అందజేస్తున్న పశువుల దాణను పాడి రైతులు రైతులు ఉపయోగించుకోవాలని సింగరాయకొండ పశు వైద్యాధికారి డాక్టర్ యన్ హజరత్ తెలిపారు.బుధవారం రైతులకు దాణను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఎల్ ని నో ప్రభావం వలన ఏర్పడిన వర్షాభావం దృష్ట్యా పాడి పశువుల మేత కొరత మరియ పాల దిగబడి తగ్గుదలను అధికమించడానికి ప్రభుత్వం పాడి రైతులకు 50% సబ్సిడీ మీద నాణ్యమైన మరియు పోషక విలువలు కలిగినటువంటి పశుల దాణను రైతులకు అందించడం జరుగుతుందిని, మండలంలో మొత్తం14 టన్నుల పశువుల దాణను రైతులకు సరఫరా చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, పశు వైద్య సహాయకులు మరియు పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.