రేణిగుంట ఆగష్టు 1. శ్రీ చల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేడ్కర్ భవన్ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అంబేడ్కర్ స్టార్ కృష్ణ అధ్యక్షతన అంబేడ్కర్ సిద్ధాంత అధ్యయన తరగతులు తిరుపతిలోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ ధర్మపోరాట సమితి వ్యవస్థాపకులు ఇంగిరాల రామచంద్రయ్య హాజరైనారు. ఈ సందర్భంగా ఇంగిరాల రామచంద్రయ్య మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ దళిత బహుజన సమాజంకోసం అహర్నిశలు కష్టపడి రాజ్యాంగాన్ని వ్రాసారని , పీడిత ప్రజలకు చైతన్యాన్ని కలిగించాలని అనేక రచనలు రాశారని , ఆయన వ్రాసిన రచనలను అధ్యయనం చేయాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమశివన్, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ గోపి, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ రావు, ట్రెజరర్ రాజేష్, ఆర్.పి. ఐ. రాష్ట్ర అధ్యక్షులు పి.అంజయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ పుష్పరాజ్, చెంగల రాయలు, అంబేద్కర్ బహుజన సంఘం నాయకులు శ్రీనివాసులు, రాజశేఖర్, శంకర్ మరియు అధిక సంఖ్యలో అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *