ఉదయగిరి ఆగస్టు 01 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఉడయగిరి మండలంలోని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మాజీ ఏఎంసి చైర్మన్ మరియు మాజీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి సూచనలతో తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని సుజాత కాలనీ మరియు దుంపవారిపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగానిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టి. సుకుమార్ తో కలిసి టీడీపీ యువ నాయకుడు గోధా సుందర్ రెడ్డి పాల్గొని పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో, పారదర్శకంగా అందేలా చర్యలు చేపట్టారు.అనంతరం ఆయన లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సూచనలను స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా గోధా సుందర్ రెడ్డి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తోందని తెలిపారు. పింఛన్ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోగాల మాధవ రెడ్డి, గోధా నాగిరెడ్డి, మల్లెల సురేష్ రెడ్డి,దుగ్గినబోయిన పెంచలయ్య,పోలకాల నరేష్,జి. మధు,ఏసోబు, ఏసురత్నం,మలకొండయ్య, ప్రసాద్ తదితరులతో పాటు తిరుమలాపురం పంచాయతీ తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం,అని గోదా సుందర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *