ఉదయగిరి జులై 31 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వంలో, మాజీ ఏఎంసీ చైర్మన్ & టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి సూచనలతో, టీడీపీ యువ నాయకుడు గోధా సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగు దేశం”కార్యక్రమంలో భాగంగా,,ఉదయగిరి మండలం, తిరుమలాపురం పంచాయతీ, దుంపవారిపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన “ఇంటింటికి తెలుగు దేశం” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి ఇంటిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు, గ్రామ ప్రజల సమస్యలు,సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నాం.ప్రజలతో మమేకమై వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ, గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం.ప్రతి కుటుంబానికి చేరువగా ఉంటూ ప్రజా సేవే,లక్ష్యంగా,ముందుకు,సాగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథలో నడుపుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు.అంతే కాకుండా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేయుటకు ఎంతో కష్టపడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు కు కార్యకర్తలు కు అభిమానులు కు మరియు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ప్రజల గడపకు తెలుగు దేశo,,ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటాం అని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *