కొండాపురం జూలై 28 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు జంగాలపల్లి గ్రామంలో ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ వారి పర్యవేక్షణలో కలిగిరి సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కలిగిరి సర్కిల్ పోలీసు సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగినది. ఈ కార్డెన్ అండ్ సెర్చ్ లో 30 టూ వీలర్స్ రెండు ఆటోలు పత్రాలు సరిగా లేని వాహనాలను సీట్ చేయడం జరిగినది. అనంతరం ఆయన వాహన దారులతో మాట్లాడుతూ వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరూ సరైన పత్రాలతో వాహనాలు నడుపుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా టూవీలర్ బైకులు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా మద్యం సేవించి, ఎలాంటి వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు. ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం లొ కలిగిరి సిఐ పి.సుబ్బారావు తో పాటు,కొండాపురం ఎస్ఐ కె.శ్రీనివాస రావు సార్ వింజమూరు ఎస్సై కలిగిరీ ఎస్సై లాతిపునిసా, మరియు కలిగిరి సర్కిల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *