- ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్
- కేంద్ర నిధుల వివరాల కోసం త్వరలోనే జెండాపై క్యూఆర్ కోడ్ స్టిక్కర్: బీడీ బాలాజీ
రేణిగుంట, జూలై 27:
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం రేణిగుంట పట్టణంలో తిరుపతి జిల్లా మన ఊరు మన జెండా కన్వీనర్, మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ ఏర్పాటు చేసిన పార్టీ జెండాను కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో రాబోయే అక్టోబర్ నెల లోపు బిజెపి జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ మాట్లాడుతూ.. రేణిగుంట పంచాయతీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన నిధుల వివరాలను ప్రజలందరికీ పారదర్శకంగా తెలియజేసేందుకు త్వరలోనే ఈ జెండాపై స్కానర్ స్టిక్కర్ అమర్చనున్నట్లు తెలిపారు. రేణిగుంట పట్టణ నడిబొడ్డున పార్టీ జెండాను ఏర్పాటు చేసే అవకాశం రావడం సంతోషకరమని పేర్కొంటూ, ఇందుకు సహకరించిన మండల కమిటీకి, సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, మండల ఇన్చార్జ్ మెలగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, జెండా కో-పాలకుడు, రేణిగుంట మండల ప్రధాన కార్యదర్శి సొంగా పురుషోత్తం, మండల అధ్యక్షుడు ప్రేమ్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పి.కె. గోపి ఆచారి, జిల్లా ఉపాధ్యక్షుడు వేణు ముదిరాజ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్, ఉపాధ్యక్షుడు రమేష్, మండల ఉపాధ్యక్షుడు రాజా రాయల్, పట్టణ అధ్యక్షుడు నరేష్ పాల్గొన్నారు.అలాగే తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు యతేంద్ర రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, సీనియర్ నాయకురాలు అన్నపూర్ణమ్మ, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు వేణు గోపాల్, మండల మోర్చా అధ్యక్షులు శ్రీకాంత్, మనోహర్, లాల్, రాజేష్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు వేడం కిష్టయ్య తదితర నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.


