ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఏవీఎస్ నేతల పోరాటం,,, స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

హాస్టల్లో విద్యార్థులపై అనుచిత వాక్యాలు చేసి అసభ్య పదాలతో విద్యార్థులను దూషించిన వార్డెన్ ను సస్పెండ్ వేటు వేయించిన ఎమ్మెల్యే కాకర్ల..

వింజమూరు జూలై 21, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

వింజమూరు ఎస్సీ హాస్టల్లో సోమవారం జరిగిన సంఘటన అత్యంత బాధాకరం. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించిన వార్డెన్ పై తిరగబడిన ఎమ్మార్పీఎస్ ఏవీఎస్ నేతలు పోరాటం ఫలించింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునేలా చేసి సస్పెండ్ చేయించడం జరిగింది.విద్యార్థుల గౌరవం భద్రత సంక్షేమం విషయంలో అని ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యా పోషకాహారం సురక్షితమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల స్ఫూర్తితో విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *