వింజమూరు జూలై 20 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం లో ఎస్సీ హాస్టల్‌లో వార్డెన్ వ్యవహార శైలిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆంధ్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు మహంతి రెడ్డి మరియు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్‌ మాదిగకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను అవమానించే విధంగా వార్డెన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ హాస్టల్ ఎదుట విద్యార్థులతో నిరసన చేపట్టమన్నారు .హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయం లో నిర్లక్ష్యంగా వ్యవరించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.వెంటనే వార్డెన్ ను సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేసారు.వారి తో పొటు ఆంద్ర విధ్యార్ధి సంఘాల నాయకులు,ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి మాదిగ, ఎంఎస్పీ మండల ఇన్చార్జీ గోచిపాతల ఆనంద్ రావు మాదిగ, విధ్యార్ధులు తదితరులు పొల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *