శ్రీకాళహస్తి జులై 16.
తొట్టంబేడు మండలం గుర్రప్ప నాయుడు కండ్రిగ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగమాల భాస్కర్ సోదరుడు “సింగమాల వెంకటాద్రి” ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు వారి స్వగృహానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా వెంకటాద్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసముద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. వెంకటాద్రి మృతి పట్ల తన తీవ్ర సెంతాపాన్ని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

